నాగర్ కర్నూల్ (ఎస్ బి న్యూస్):, అక్టోబర్ 31:నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట, నల్గొండ జిల్లా డిండి సరి హద్దులో రెండింటి మధ్య ఉన్న
మొంథా తుఫాన్ బీభత్సంతో నల్గొండ జిల్లా డిండి వాగు ఉధృతంగాప్రవహించింది. ఈ క్రమంలో ఉప్పు నుంతల మండలం లత్తి పూర్ గ్రామానికి చెందిన గొర్రెల కాపరి దంపతులు వరదలో చిక్కుకునిప్రాణభయంతోఅల్లాడిపోయారు.స్థానికులద్వారాసమాచారంఅందుకున్న అచ్చంపేట పోలీసులు వెంటనే స్పందించి తాడుల సాయంతో శ్రమించి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ రక్షణ చర్యల్లో డీఎస్పీ పల్లె శ్రీనివాసులు, సీఐ నాగరాజు, ఎస్ఐ వెంకట్ రెడ్డి, కానిస్టేబుల్ లింగం, లస్కర్ నాయక్ బృందం పాల్గొన్నారు.
వాగులో చిక్కుకున్న దంపతులకుపోలీసులు తక్షణమే ఆహారం అందజేసి, గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వారిని సురక్షితంగా ఇంటికి చేర్చినట్లు అధికారులు తెలిపారు.పోలీసుల చాకచక్యం, మానవత్వగుణం చూపడం పట్ల గ్రామస్థులుకృతజ్ఞతలుతెలుపుతూ ప్రశంసల వర్షం కురిపించారు.
Social Plugin