అశ్వాపురం మండల కేంద్రంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అశ్వాపురం ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్ (RC.NO 257/2025)సర్టిఫికెట్‌ను అశ్వాపురం తహశీల్దార్ సూర్యప్రకాష్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అశ్వాపురం ప్రెస్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో తహశీల్దార్ సూర్యప్రకాష్ ను శాలువాతో సన్మానించారు.అనంతరం ఆయన చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ జర్నలిస్టులంతా ఐక్యంగా ఒక సంఘంగా ఏర్పడి, చట్ట బద్ధంగా ప్రెస్ క్లబ్‌ను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అభినందనీయమన్నారు. జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమానికి ప్రెస్ క్లబ్ ఒక వేదికగా నిలవాలని ఆకాంక్షించారు.అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వెలమ రాజేందర్ మాట్లాడుతూ అశ్వాపురం ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, సంక్షేమం,ఐక్యతతో పాటు మండలంలోని ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో అశ్వాపురం ప్రెస్ క్లబ్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. నిబంధనల ప్రకారం ప్రెస్ క్లబ్‌ను నిర్వహిస్తూ జర్నలిస్టులందరికీ అందుబాటులో ఉండేలా కార్యాచరణ కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ లీలావతి, రెవెన్యూ సిబ్బంది, ప్రెస్ క్లబ్ సభ్యులు, పాల్గొన్నారు.
0 కామెంట్‌లు