గ్రామీణ పట్టణ యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలి.
ఎన్నికల హామీ ప్రకారం యువతకు నిరుద్యోగ భృతి అందించాలి.
ప్రగతిశీల యువజన సంఘం డిమాండ్
జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పూణే మంగయ్య, రామకృష్ణ కోర్సా
*గుండాల మండలం ఆగస్టు 29 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*
నిరుద్యోగ యువత భవిష్యత్తుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటం ఆపాలి అని గ్రామీణ పట్టణ యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం యువతకు నిరుద్యోగ భృతి అందించాలని ప్రగతిశీల యువజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పూణే మంగయ్య కోర్సా రామకృష్ణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. శనివారం గుండాల మండలంలో కాంచనపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఇల్లందు డివిజన్ జనరల్ బాడీ సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని అన్ని ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి అని ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి నిర్దిష్ట కాలపట్టిక ప్రకారం నియామకాలు చేపట్టాలి అని ఉపాధ్యాయ, వైద్య, పోలీస్, రెవెన్యూ, విశ్వవిద్యాలయ ఖాళీలను అత్యవసరంగా భర్తీ చేసి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేసి కొత్త ఉద్యోగాలు సృష్టించాలి అని కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాలను రద్దు చేసి శాశ్వత ఉద్యోగాలు కల్పించి నియామక ప్రక్రియల్లో పారదర్శకత పాటించి పరీక్షలను సకాలంలో నిర్వహించాలని ప్రగతిశీల యువజన సంఘం తరఫున డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు జీవన భృతి అందించాలని, పరిశ్రమల స్థాపన ద్వారా గ్రామీణ, పట్టణ యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలని అన్నారు. యువతకు ఉపాధి ఉద్యోగం హక్కుగా కల్పించి ఉద్యోగం కోసం ఎదురుచూడటం మాత్రమే పరిష్కారం కాదు. హక్కుల కోసం సంఘటిత పోరాటమే మార్గం కావాలని అన్నారు. ఖాళీ పోస్టుల భర్తీ కోసం ఉపాధి హక్కు కోసం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా యువత ఐక్యంగా ఉద్యమించాలి అని యువతకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం ఇల్లందు డివిజన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
డివిజన్ అధ్యక్ష కార్యదర్శులుగా ఉకే శ్రవణ్, వెలుగు శాంతారావు ఉపాధ్యక్షులుగా ధారావత్ సుందర్, సహాయ కార్యదర్శిగా కల్తి సుదర్శన్ కోశాధికారిగా బానోత్ సురేందర్ లను ఎన్నుకోవడం జరిగింది. చంద్రశేఖర్, భయ్యా ఎంకన్న, చందవత్ లక్ష్మణ్, గంగావత్ జగదీష్, దారావత్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు