గుండాల ఉన్నత పాఠశాల విద్యా కమిటీ మాజీ చైర్మన్ బొబ్బిలి రమేష్ మృతి

గుండాల ఉన్నత పాఠశాల విద్యా కమిటీ మాజీ చైర్మన్ బొబ్బిలి రమేష్ మృతి

అనారోగ్యంతో మంగళవారం తుదిశ్వాస

2018లో గుండాల ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు.

సీపీయూఎస్ఐలో గుండాల గౌడ అధ్యక్షుడిగా సేవలు

వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తుల సంతాపం

గుండాల మండలం ఆగస్టు 26 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి:

గుండాల ఉన్నత పాఠశాల విద్యా కమిటీ మాజీ చైర్మన్, మాజీ యువజన నాయకుడు బొబ్బిలి రమేష్ (48) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. ఆయన మృతి పట్ల గుండాల మండలానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

బొబ్బిలి రమేష్ 1978లో జన్మించారు. చిన్ననాటి నుంచే సామాజిక అంశాలపై ఆసక్తి కనబరిచిన ఆయన యుక్తవయసులో యువజన నాయకుడిగా పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ స్థానికంగా తనదైన గుర్తింపు పొందారు. గతంలో విప్లవకారుడు మారోజు వీరన్న నేతృత్వంలోని సీపీయూఎస్ఐలో గుండాల గౌడ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.

2018 సంవత్సరంలో గుండాల ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన రమేష్, పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సమస్యలు, విద్యా వాతావరణానికి సంబంధించిన అంశాలపై దృష్టి సారించారు. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో సమన్వయంతో పనిచేశారు.

ఇటీవల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమేష్ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, స్నేహితులు కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులర్పించారు. ఈ విషాద సమయంలో రమేష్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని వివిధ పార్టీల నాయకులు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు