పినపాక:జాతీయ పులుల గణనను ప్రత్యక్ష, పరోక్ష పద్ధతిలో పకడ్బందీగా గుర్తించాలని ఎఫ్డీఓ మక్సూద్
సూచించారు. మంగళవారం పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్లో గల అటవీశాఖ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్వినితో కలిసి సిబ్బందికి అవగాహన కల్పించారు . పులులు, శాఖాహార, మాంసాహార జంతువులను తమ వద్ద గల ప్రత్యే మొబైల్ యాప్‌లో డౌన్‌లోడ్ చేసుకొని తద్వారా మ్యాప్ ఏర్పాటు చేసుకుని అవగాహన కల్పించారు.
పులుల గణనలో పులి చారలను గుర్తించడం, పాదముద్రలు, మలం, గోళ్లు వంటి ఆధారాలు సేకరించడం, కెమెరా ట్రాప్‌లు ఉపయోగించడం, అటవీ సిబ్బంది, వాలంటీర్ల ద్వారా ప్రత్యక్ష లెక్కించడం వంటి పద్ధతులు ఉపయోగిస్తామన్నారు. మనిషి వేలి ముద్రల వలె పులుల చారలు ప్రత్యేకంగా ఉండటంతో, ప్రతి పులిని వేరుగా గుర్తించవచ్చన్నారు.
పులి పంజా గుర్తులు కూర్చున్నపుడు ఒకవిధంగా, నిలుచున్నపుడు మరోవిధంగా, పరిగెత్తే సమయంలో మరొకలా ఉంటాయని తెలిపారు.గతంలో ఈ బయ్యారం రేంజ్ పరిధిలో పులి తిరిగిన జిపిఎస్ మ్యాపు ఉందన్నారు.పులుల గణనలో సహాయం చేయడానికి స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లు, జంతు ప్రేమికులు, యువకులు కూడా పాల్గొనవచ్చు అన్నారు.
నాలుగు సంవత్సరాలకు ఒకసారి జాతీయ పులుల సంరక్షణ అథారిటీ ద్వారా దేశవ్యాప్తంగా పులుల గణన జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ 17 నుండి 20 వరకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లుగా తెలిపారు.2018 గణన ప్రకారం మన దేశంలోని పులుల సంఖ్య 2,461 అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు అరుణ, వెంకటేశ్వరరావు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.
Social Plugin