నాగర్ కర్నూల్,నవంబర్,13,(ఎస్ బి న్యూస్): అరణ్య సంపద, ఆధ్యాత్మిక క్షేత్రాలు, ప్రకృతిసౌందర్యానికి పెట్టింది,పేరుగాంచి న నల్లమల ప్రాంతాన్ని దేశ స్థాయిలో గుర్తింపు పొందే ప్రధాన టూరిజం హబ్‌గా తీర్చిదిద్దడమే తన జీవిత లక్ష్యం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీ కృష్ణ తెలిపారు. మే 19, 2025ననాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గం లోని అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో జరిగిన ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభ కార్యక్రమాన్ని ప్రారంభించి,పాల్గొన్న ముఖ్యమంత్రి, నల్లమల ప్రాంత అభివృద్ధి పై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అందజేసిన వినతి పత్రానికిసానుకూలంగా స్పందిస్తూ, నల్లమలప్రాంతంలోనిప్రముఖపర్యాటక కేంద్రాల అభివృద్ధికి మార్గం సుగమం చేశారని ఎమ్మెల్యే ఒక ప్రకటనలో తెలిపారు. నల్లమలప్రాంతంలో ఉన్నశ్రీఉమామహేశ్వరం,మద్దిమడుగు దేవస్థానం, మల్లెల తీర్థం, వ్యూ పాయింట్ తదితర ఆధ్యాత్మిక, ప్రకృతి సౌందర్యపర్యాటక ప్రాంతాలఅభివృద్ధికి తెలంగాణ టూరిజండెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.100 కోట్లతో సమగ్ర అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రతిపాదన సర్క్యులర్ జారీ అయ్యిందని ఎమ్మెల్యే శని వారం ఒక ప్రకటన లో వెల్లడించారు.
ఈ ప్రతిష్టాత్మక టూరిజం ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే టెండర్లు, నిధుల విడుదల తో ప్రారంభం కానున్నట్లు సీఎంఓ వర్గాలువెల్లడించాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన ప్రతిని మీడియా సమావేశంలో ఎమ్మెల్యే చూపిస్తూ, నల్లమల ప్రాంత అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే భవిష్యత్తులో కూడా ఇలాంటి అభివృద్ధికార్యక్రమాలకు తమకు, ఈప్రాంతానికిఆయన తోడ్పాటు కొనసాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ అభివృద్ధితో నల్లమల ప్రాంతానికి పర్యాటకుల రాక పెరిగి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కలగడంతో పాటు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపిరి లభించనుందని ఆయన తెలిపారు. అయితే నల్లమల ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా మార్చే దిశగా నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రయత్నాలకు నల్లమల ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని పేర్కొన్నారు.
Social Plugin