భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ (Reg.No.209/24) సభ్యుల సమావేశం అధ్యక్షుడు దుగ్గంపూడి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగింది. జిల్లా సెక్రటరీ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రజా సమస్యలు ఎదురైనప్పుడు వాటి పరిష్కారం కోసం సంస్థ పనిచేస్తుందని తెలిపారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేసే సమర్థులైన అభ్యర్థులను ఎన్నుకోవాలని సూచించారు. ఆరు సంవత్సరాలుగా సారపాకలో ఎన్నికలు జరగకపోవడంతో అభివృద్ధి నిలిచిపోయిందని, ఈసారి ఓటు అనే శక్తిని సక్రమంగా వినియోగించాలని పిలుపునిచ్చారు. నాయకులు కూడా ఇచ్చిన హామీలను తప్పకుండా నిలబెట్టుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డోంకన చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు దామెర ఆదినారాయణ, సహాయ కార్యదర్శి ఉర్లగొండ వీరన్న, లీగల్ అడ్వైజర్ రంగు రామచంద్రరావు, సెగ్మెంట్ ప్రెసిడెంట్ కారం హనుమంత్, దుర్గ ప్రసాద్, వెంకట నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.
Social Plugin