బయ్యారం సాయి నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌కు గురుస్వామి పీఠం సేవా హస్తం

పినపాక మండలం బయ్యారం గ్రామపంచాయతీ సాయి నగర్ కాలనీలో నివసిస్తున్న దోమల లక్ష్మణ్ అనే ఆటో డ్రైవర్ గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా లేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న నర్సులు గురుస్వామి పీఠం పోతిరెడ్డిపల్లి వారు ముందుకు వచ్చారు.ఆదివారం పీఠం తరఫున నిరుపేద కుటుంబానికి ఆర్థిక భరోసాగా రూ.5,000లను అందజేశారు. చికిత్సకు తోడ్పడేలా ఇచ్చిన ఈ సహాయాన్ని లక్ష్మణ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
సామాజిక సేవలో గురుస్వామి పీఠం చూపుతున్న ప్రజాసేవా దృక్పథాన్ని స్థానికులు అభినందించారు.