పినపాక:పినపాక మండలం కొత్త రెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఉడుముల వెంకట రవీందర్ రెడ్డి న్యాయవాదిగా కొత్త జీవనాధ్యాయాన్ని ప్రారంభించారు. శనివారం నాడు హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్లో, స్టేట్ బార్ కౌన్సిల్ అధికారులు ఆయనకు న్యాయవాది ఎన్రోల్మెంట్ పత్రం మరియు గుర్తింపు కార్డు అందజేశారు. వెంకట రవీందర్ రెడ్డి తండ్రి చిన్న సుబ్బారెడ్డి, తల్లి రామ సుబ్బులు. న్యాయ విద్య పూర్తి చేసిన అనంతరం, న్యాయవాదిగా ప్రజలకు చట్టబద్దమైన సహాయం అందించాలనే సంకల్పంతో ఆయన ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఉడుముల వెంకట రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చే చట్టబద్దమైన సమస్యలకు సత్వర న్యాయం అందించడానికి న్యాయవాదిగా కృషి చేస్తాను. నాకు లా పట్టా పొందడంలో సహకరించిన నా కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. గ్రామస్తులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆయనకు అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో ప్రజల పక్షాన న్యాయ సాధనలో అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు.
Social Plugin