షీ టీం అవగాహన కార్యక్రమం – అమ్మాయిల రక్షణే మా ప్రాధాన్యం

షీ టీం అవగాహన కార్యక్రమం – అమ్మాయిల రక్షణే మా ప్రాధాన్యం

నాగర్ కర్నూల్:
ఆడపిల్లల రక్షణ, మహిళల భద్రత కోసమే షీ టీం పనిచేస్తుందని నాగర్ కర్నూల్ షీ టీం ఎస్సై రజిత తెలిపారు. విద్యార్థినులకు భద్రతా చట్టాలు, వాటి వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్య‌క్ర‌మం నిర్వహించారు.

ఎస్సై రజిత మాట్లాడుతూ, “అమ్మాయిలపై హేళన, అవమానకర వ్యాఖ్యలు చేయడం, ప్రేమ పేరుతో ఒత్తిడి తేవడం వంటి చర్యలు కఠినంగా శిక్షార్హం” అని హెచ్చరించారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చిన వెంటనే షీ టీం హెల్‍ప్‌లైన్ 8712657676 కు కాల్ చేయాలని ASI విజయలక్ష్మీ సూచించారు.

భరోసా కేంద్రం ద్వారా బాధితులకు పోలీసు, న్యాయ, వైద్య సహాయం తో పాటు కౌన్సెలింగ్ కూడా అందుబాటులో ఉందని కో–ఆర్డినేటర్ శ్రీలత వివరించారు. ఇతరుల మాయమాటలు నమ్మి హ్యూమన్ ట్రాఫికింగ్‌లో చిక్కుకునే సంఘటనలు పెరుగుతున్నాయని AHTU సభ్యులు హెచ్చరించారు. జిల్లాలో ట్రాఫికింగ్ కార్యకలాపాలు కనిపిస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో షీ టీం సభ్యులు వెంకటయ్య, వెంకట్, స్కూల్ HM భాస్కర్ రావు, టీచర్లు, విద్యార్థినులు, విద్యార్థులు పాల్గొన్నారు.