- తిర్లాపురం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, ప్లేట్లు, గ్లాసుల పంపిణీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని తిర్లాపురం పంచాయతీ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలో బుధవారం బి టి పి ఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ కార్యక్రమం జరిగింది.
కార్యక్రమానికి బి టి పి ఎస్ చీఫ్ ఇంజనీర్ భూక్య బిచ్చన్న ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “బి టి పి ఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ టీం గత మూడు సంవత్సరాలుగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది” అన్నారు. విద్యార్థులు చదువును ఇష్టంగా నేర్చుకోవాలని, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలని, మంచి విద్యతో తల్లిదండ్రులకు, గురువులకు, పాఠశాలకు గౌరవం తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ టీం సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Social Plugin