భూ భారతి లో కూడా పరిష్కారం కానిభూసమస్యలు


నాగర్ కర్నూల్,అక్టోబర్,27(ఎస్ బి న్యూస్),:తెలంగాణ రాష్ట్రంలోభూమినినమ్ముకున్న రైతుల కు భూమిలేని నిరు పేదలకు పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అందించాలని పి.నరసింహ
భూభారతిలో కూడా భూ సమస్యలు పరిష్కారం కాలేదని తెలంగాణ వ్యయసాయ కార్మిక సంఘం సమా వేషం లో జిల్లా కార్యదర్శి, పి నరసింహ తెలిపారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అచ్చంపేట నియోజకవర్గ ముఖ్య బాధ్యుల సమావేశం సోమవారం స్థానిక కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి పి.నరసింహ మాట్లాడుతూ, భూభారతి చట్టం వచ్చినా పేదలు, దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు ఇప్పటికీ పట్టాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రూ.12 వేల రూపాయలను తక్షణం మంజూరు చేయాలని నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూభారతి చట్టం ద్వారా పేదలకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, గ్రామీణ స్థాయిలో పేద రైతుల సమస్యలు యథాతథంగా నే కొనసాగుతున్నాయని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో ఉప్పునుంతల మండల కార్యదర్శి చింతల నాగరాజు, అమ్రాబాద్ మండల కార్యదర్శి ఎస్. మల్లేష్, అచ్చంపేట మండల కార్యదర్శి వర్ధం సైదులు తది తరులు పాల్గొన్నారు.