నాగర్ కర్నూల్, అక్టోబర్ 21 (ఎస్ బి న్యూస్):
గ్రామపంచాయతీ కార్మికులు తమ హక్కులు సాధించుకోవాలంటే పోరాటాలే ఏకైక మార్గమని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీనివాసులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతన చట్టాన్ని అమలు చేయడం లేదని, ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణం లోని టీ ఎన్ జీ వో భవన్ లో సోమవారం నిర్వహించిన గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ జిల్లా మూడవ మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, గ్రామాలలో ప్రజారోగ్యానికి ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు.
ప్రభుత్వానికి ఆయన ప్రశ్నించిన ప్రశ్నలు:
కర్ణాటక, కేరళ, చండీగఢ్ రాష్ట్రాల్లో పంచాయతీ కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి జీతాలు ఇస్తున్నారు.
పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌లో గ్రామపంచాయతీ కార్మికులకు రూ.18,000 జీతం ఇవ్వుతున్నారు.
అదే తెలంగాణలో ఎందుకు విస్మరణ? ఎందుకు కనీస వేతనం లేదు?
ముఖ్య డిమాండ్లు:
కనీస వేతన చట్టం అమలు చేయాలి
ప్రమాద భీమా రూ.10 లక్షలు కల్పించాలి
మృతి కార్మికుల మట్టి ఖర్చులకు రూ.50,000 ఇవ్వాలి
ఉద్యోగ భద్రత కల్పించి, ఎవరికావాలంటే వారికి తొలగించే పరిస్థితి ఉండకూడదు
"ఒకప్పుడు వేతనమే లేని స్థితి నుంచి పోరాటాల ద్వారా రూ.9,500 వరకు జీతాలను సాధించుకున్నాం. ఇదంతా సీఐటీయూ ఘనత" అని ఆయన కార్మికుల కు గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులు మారినా, కార్మికుల ఉద్యోగాలు మారకూడదని, వారి హక్కులను రక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పలువురు నేతలు పాల్గొన్న సభ
ఈ మహాసభకు జిల్లా అధ్యక్షుడు భక్తుల వెంకటేష్, కార్యదర్శి మల్లేష్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎం. శంకర్ నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మల్లేష్, నాగరాజు, సైదులు, సీఐటీయూ పట్టణ కార్యదర్శి బి. రాములు, గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా నాయకులు బాలస్వామి, లింగస్వామి, వెంకటేశు, రాము, పరశురాములు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
"మహాసభలో తీసుకున్న నిర్ణయాల మేరకు రాబోయే కాలంలో పోరాటాలను మరింత ఉధృతం చేసి, కార్మికుల హక్కులు సాధించుకుంటాం" అని వారు స్పష్టం చేశారు.
Social Plugin