అమరుల త్యాగఫలమే నేడు జరుపుకుంటున్న ప్రజా పాలన: ఏడిఏ తాతారావు, తహసిల్దార్ గోపాలకృష్ణ

అమరుల త్యాగఫలమే నేడు జరుపుకుంటున్న ప్రజా పాలన
- ఏడిఏ తాతారావు, తహసిల్దార్ గోపాలకృష్ణ 

ఎస్. బి న్యూస్, పినపాక: ఎంతోమంది పోరాటాల ఫలితమే నేడు జరుపుకుంటున్న ప్రజా పాలన దినోత్సవం అని జిల్లా వ్యవసాయ సహాయ అధికారి తాతారావు, తాసిల్దార్ గోపాలకృష్ణ అన్నారు. బుధవారం పినపాక ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజా దినోత్సవం వేడుకలలో ఏడిఏ తాతారావు, తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ గోపాలకృష్ణ, మండల విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈఓ నాగయ్య పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో ఎంతోమంది వీరులు అమరులయ్యారని , దొరల గడులు బద్దలు కొట్టి నేడు రెపరెపలాడే జెండా తెలంగాణలో ఎగిరింది అన్నారు. అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. అలాగే పినపాక మండల వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పతాక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సునీల్ కుమార్, ఎంపీ ఓ వెంకటేశ్వరరావు, ఏపీఓ వీరభద్ర స్వామి, ఏవో వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం, మైనార్టీ సెల్ అధ్యక్షులు బషీరుద్దీన్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.