ప్రజా పాలనలో పేదలకు సంక్షేమ పథకాల జాతర – పినపాకలో ఎమ్మెల్యే పాయం

 

- ప్రజా పాలనలో పేదలకు సంక్షేమ పథకాల జాతర - పినపాక పర్యటనలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
- కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు


 (SBNEWS), పినపాక: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అర్హులైన పేదలను గుర్తించి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం పినపాక మండల పర్యటన లో భాగంగా ఎల్చిరెడ్డిపల్లి, ఏడూళ్ల బయ్యారం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎల్చిరెడ్డిపల్లి ,ఏడూళ్ల బయ్యారం కాంగ్రెస్ పార్టీ నాయకులు 300 బైక్లతో భారీ ర్యాలీ తీస్తూ ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో సంక్షేమ పథకాల జాతర నడుస్తుందన్నారు. అభివృద్ధి పథకాలను చూసే పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం అత్యంత పారదర్శకంగా అర్హులను గుర్తించి అందజేస్తున్నామని అన్నారు. తొలి విడతలో నియోజకవర్గానికి 3500 ఇళ్లతో పాటు మరో వెయ్యి ఇండ్లు అదనంగా ఇచ్చామని మరో  1500 ఇండ్లు రాబోతున్నాయన్నారు. నియోజకవర్గానికి 6000 ఇండ్లు రాబోతున్నాయని తెలిపారు.. అలాగే ఉచిత బస్ ప్రయాణం ,200 యూనిట్ల ఉచిత కరెంటు ,500 కే వంట గ్యాస్, రైతు భరోసా రుణమాఫీ ధాన్యానికి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ వంటి పథకాలతో దేశంలోనే ఏ రాష్ట్రం ఏ రాష్ట్రంలోనూ ఇవ్వనన్ని సంక్షేమ పథకాలు తెలంగాణలో ఇస్తున్నామన్నారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను జీర్ధించుకోలేకనే ప్రతిపక్ష బిఆర్ఎస్ కుటుంబ డ్రామాకు తెర లేపిందని, యూరియా కొరతను కేంద్రం కావాలని సృష్టిస్తే బీఆర్ఎస్ కేంద్రంలోని బిజెపిని నిలదీయకుండా రాజకీయాలకు వాడుకుంటుందన్నారు. బీఆర్ఎస్ చమకబారు ఎత్తుగడలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధికి టిఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబ అవినీతి పాలనకు మధ్యనే అన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుతున్న దొంగలకు ప్రజల దగ్గరకి వెళ్లి ఓట్లు అడిగే హక్కు లేదని, ఏ మొహం పెట్టుకుని గ్రామాలకు వస్తారు నిలదీయాలన్నారు. బిజెపి బీఆర్ఎస్ వి దొంగ దోస్తీ అని, వారి మధ్య బడే భాయ్ చోటే బాయ్ లా చీకటి ఒప్పందాలని ప్రజలు గమనించాలన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథం, నాయకులు గంగిరెడ్డి వెంకట రెడ్డి,  లక్ష్మిరెడ్డి, పేరం వెంకటేశ్వరరావు,  శ్రీనివాస్ రెడ్డి, దాట్ల రాజేష్, తోలెం కళ్యాణి, కల్లాకుల బుచ్చిబాబు, అర్జున్, మధు రెడ్డి, గీద సాయి, బండారు సాంబ, పొనగంటి మల్లయ్య, బోడ రమేష్, కొప్పుల వీరస్వామి, బూర బతకయ్య, చీకటి సత్యనారాయణ, కే శ్రీను, యాలం బుజ్జి బాబు, కే లింగయ్య తదితరులు పాల్గొన్నారు.