భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 14 (ఎస్ బి న్యూస్): “రాబోయేది యూట్యూబ్ ఛానల్ యుగమే, యూట్యూబ్ జర్నలిజం రాబోయే కాలంలో ప్రధాన శక్తిగా మారనుంది” అని తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి పాపారావు స్పష్టం చేశారు.
ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఎన్నికలు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జయగణేష్ అధ్యక్షతన కొత్తగూడెం యూటీఎఫ్ భవన్‌లో ఘనంగా జరిగాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో, పూర్తి పారదర్శకంగా జరిగిన ఈ ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానల్‌ల సీఈఓలు, ప్రతినిధులు, జర్నలిస్టులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
కొత్త కమిటీ సభ్యుల ఎంపిక
ఈ ఎన్నికల్లో నూతనంగా జిల్లా కమిటీకి ఎన్నికైన సభ్యులు:
• జిల్లా గౌరవ అధ్యక్షుడు: టి. రామ్ నరసింహ
• అధ్యక్షుడు: శెట్టి సతీష్ కుమార్
• ఉపాధ్యక్షుడు: మాలోత్ వేణు
• ప్రధాన కార్యదర్శి: కోడి రెక్కల కమలాకర్
• కార్యదర్శి: బీరా రవీందర్ నాథ్
• సహాయ కార్యదర్శి: దాస్యం మహేష్
• ట్రెజరర్: శనగ లక్ష్మణ్
• గౌరవ సలహాదారులు: బృహస్పతి శ్రీరామ్, ఋషి కుమార్
• కార్యవర్గ సభ్యులు: మోట జగదీష్, భూపతి అశోక్, సురేష్, ప్రసాద్
ఈ నూతన కమిటీ సభ్యులను రాష్ట్ర కమిటీ ఘనంగా సన్మానించింది.
యూట్యూబ్ జర్నలిజం ప్రాముఖ్యతపై పులిపాటి పాపారావు
రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి పాపారావు మాట్లాడుతూ: జర్నలిజం ఒక పవిత్రమైన బాధ్యత, యూట్యూబ్ ఆధారిత జర్నలిజం వేగవంతమైన సమాచారాన్ని అందించడంలో కీలకపాత్ర, మీడియా బలం ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడంలోనే ఉందని స్పష్టం, అలాగే జిల్లా కమిటీ ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, సామాజిక సమస్యలను భయం లేకుండా ప్రజల ముందుకు తీసుకురావాలని ఆయన సూచించారు. జర్నలిస్టులు వృత్తిని కేవలం ఉద్యోగంగా కాకుండా సమాజ సేవగా భావిస్తేనే మార్పు సాధ్యమవుతుందని పాపారావు పేర్కొన్నారు.
జర్నలిస్టుల సంక్షేమానికి హామీ
భవిష్యత్తులో జిల్లాలో యూట్యూబ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం రక్షణ చర్యలు, వృత్తి నైపుణ్యాల పెంపు కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర కమిటీ హామీ ఇచ్చింది.
రాష్ట్ర స్థాయి నేతల పాల్గొనడం
ఈ ఎన్నికల కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ వైస్ ప్రెసిడెంట్ యం.డి ఫైసుద్దీన్, జనరల్ సెక్రటరీ పులకంటి శ్రీనివాస్, ట్రెజరర్ రామ్ టెంకి శ్రీనివాస్, సెక్రటరీలు రామడుగు కొనరన్న, పల్లె నరసింహ రెడ్డి, సహాయ కార్యదర్శి కర్రే నరేందర్, గౌరవ సలహాదారు యం.డి గౌస్ పాషా, ఎక్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు డి. ప్రేమ్ కుమార్, భరత్ తదితరులు పాల్గొన్నారు.
Social Plugin