స్వాతంత్ర్య భారత్ న్యూస్ ప్రతినిధి నాగర్ కర్నూల్
నాగర్‌కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ శివారులోని గోల్డెన్ కేఫ్ దాబా వద్ద పోలీసులు నిషిద్ధ మత్తు పదార్థం అల్పాజోలం విక్రయంపై దాడి చేశారు. నమ్మదగిన సమాచారంతో ఎస్‌ఐ కె.గోవర్ధన్ సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ రైడ్‌లో అనుమానాస్పదంగా ఉన్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన నిందితులు— వంగ ఆంజనేయులు గౌడ్ (41), గార్లపాటి పురుషోత్తమ్ గౌడ్ (34), గులోలు సాయి రాం (22), మైల శివ శంకర్ (20)— కల్లు షాపుల్లో మత్తు పెంచేందుకు అల్పాజోలం కలిపి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.
స్థలంలో నిందితుల వద్ద నుంచి 26.22 గ్రాముల నిషిద్ధ అల్పాజోలం, అలాగే ఇద్దరి మొబైల్ ఫోన్లు పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. అల్పాజోలం కొనుగోలుకు వచ్చిన ఇద్దరు యువకులనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సబ్‌డివిజనల్ పోలీస్ అధికారి పర్యవేక్షణలో, డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు, సీఐ అశోక్ రెడ్డి, ఎస్‌ఐ గోవర్ధన్, పోలీసులు భీముడు, వెంకటేష్, రమేష్ తదితరులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Social Plugin