69వ అండర్ 17 బాల బాలికల కబడ్డీ క్రీడలు పినపాక ఏజెన్సీ ఈ బయ్యారం గ్రామంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ క్రీడల నిర్వహణ రాష్ట్రానికే కాకుండా దేశానికి సైతం ఆదర్శంగా నిలవాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం ఆయన పినపాక మండలం ఈ - బయ్యారంలో జరుగుతున్న కబడ్డీ క్రీడలను పరిశీలించారు. క్రీడాకారులను అడిగి ఏర్పాట్లు, వసతి, భోజన వివరాలు తెలుసుకున్నారు. క్రీడాకారులకు అందిస్తున్న భోజనాన్ని ఆయన పరిశీలించి విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించడమే కాకుండా విద్యార్థులలో కలిసి భోజనం చేశారు. కంది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం గర్వకారణం అని చైర్మన్ కంది సుబ్బారెడ్డిని అభినందించారు. సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం పీడీలను, ఎంపీ ఓ వెంకటేశ్వరరావును అడిగి ఏర్పాట్ల వివరాలను తెలుసుకున్నారు. ఎంపీఓ వెంకటేశ్వరరావును, బందోబస్తు ఏర్పాటు చేసిన సీఐ వెంకటేశ్వర్లను ప్రత్యేకంగా అభినందించారు. మంచి కవరేజ్ అందిస్తున్న మీడియాను సైతం అభినందించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ గోపాల కృష్ణ, ఎంఈఓ నాగయ్య, స్పోర్ట్స్ సెక్రటరీ నరేష్, ఎస్ఐ సురేష్, పిడి వీరన్న, పూర్వ విద్యార్థులు గంగిరెడ్డి వెంకటరెడ్డి, గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు, క్రీడాకారులు, పాల్గొన్నారు.
Social Plugin