గుండెపోటుతో వ్యక్తి మృతి.... గ్రామంలో విషాద ఛాయలు

ములుగు:ములుగు జిల్లా తాడ్వాయి మండలం బంధాల గ్రామానికి చెందిన నాలి వెంకటయ్య (వయసు 55 సంవత్సరాలు) గుండెపోటుతో ఆదివారం ఆకస్మికంగా మృతి చెందారు. సమాచారం ప్రకారం, ఆయనకు అకస్మాత్తుగా ఛాతి మంట కలగడంతో కుటుంబ సభ్యులకు తెలియజేస్తుండగానే రెండు నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు విడిచారు.ఆయన మరణ వార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు ఆయన ఆకస్మిక మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.