నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం — అండగా నిలిచిన చింతల బయ్యారం యువకులు

 పినపాక మండలం పాత రెడ్డిపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని చింతల బయ్యారం గ్రామానికి చెందిన ముత్తేబోయిన రమణ, భర్త వెంకటేశ్వర్లు అనే మహిళకు ఇటీవల చేతికి గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న గ్రామ యువకులు స్పందించి ఆర్థిక సహాయం అందించారు.శనివారం యువకులు రమణ కుటుంబాన్ని పరామర్శించి 25 కిలోల బియ్యం, రూ.11,500 నగదును అందజేశారు. కుటుంబానికి ఎటువంటి ఆపద వచ్చినా తమవంతు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పొనగంటి కిషోర్, మునిగల సంతోష్, తోట ప్రశాంత్, జింక నాగరాజు, గుమ్మల సాయి, కొప్పుల లక్ష్మణ్, పొనగంటి సాంబశివరావు, సురేష్, విష్ణు, శరత్, తిరుపతి సాయి, కళ్యాణ్, పొనగంటి సాయి, వల్లి శివ, బంగారం, పొనగంటి పున్నారావు తదితరులు పాల్గొన్నారు.