- సరదాగా మొదలుపెట్టిన అలవాటు వ్యసనం గా మారుతుంది
- యువత దేశానికి పట్టుకొమ్మలు ...వారు మంచి ఆలోచనలు కలిగి ఉండాలి
- డ్రగ్స్ రహిత సమాజానికి యువత, విద్యార్థులు సహకరించాలి
- మణుగూరుడీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి
SB UPDATES PINAPAKA
విద్యార్థులకు డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల సేవనం వల్ల కలిగే అనర్ధాలపై పోలీస్ శాఖ నేతృత్వంలో అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో గల శ్రీవిద్య జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి హాజరై మాట్లాడారు.
గంజాయి, డ్రగ్స్ వినియోగించడం వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నట్లు తెలిపారు.
ఇలాంటి వాటికి విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. చదువుతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందన్నారు. ఉన్నత లక్ష్యంతో విద్యార్థులు, యువత ముందుకు వెళ్లాలని సూచించారు. ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినా, సేవించినా పోలీసులకు గాని, కుటుంబ సభ్యులకు గానీ సమాచారం ఇవ్వాలని కోరారు. డ్రగ్ సేవించే వారిపై అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ వాడకం వల్ల వచ్చే దుష్పరిణామాలు, ఆరోగ్య సమస్యల గురించి విద్యార్థులకు వివరించారు. చాలామంది యువత సరదాగా మొదలుపెట్టిన ఈ అలవాటు వ్యసనంగా మారి వారి భవిష్యత్తును నాశనం చేస్తుందని కాబట్టి విద్యార్థులు అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని విద్యార్థుల గురించి హితవు పలికారు.యువత దేశానికి పట్టుకొమ్మలని వారు మంచి ఆలోచనలు కలిగి ఉండాలని సమాజాభివృద్ధికి తద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడాలని విద్యార్థులకు సూచించారు.
ఒక వ్యక్తి డ్రగ్స్ కి అలవాటు అయితే మాన్పించడం చాలా కష్టమని డ్రగ్స్ వినియోగం వల్ల ఆ వ్యక్తి ఏం చేస్తాడో తనకే తెలియదని, మత్తులో నిద్రిస్తాడని, క్రూరమైన ఆలోచనలు కలిగి ఉంటాడని తెలియజేశారు. విద్యార్థులు తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు అనుమానం వచ్చినా, విక్రయిస్తున్నట్టు తెలిసిన పోలీసులకు సమాచారం అందివాలని అప్పుడు మాత్రమే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమవుతుందని అన్నారు. విద్యార్థులు, సామాన్య ప్రజలు పోలీసు వారికి తమ వంతు సహాయ, సహకారాలు అందించాలని సూచించారు. కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని సమాజం ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి పదంలో పయనిస్తుందని తెలియజేశారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వరరావు , ఎస్సై సురేష్, శ్రీవిద్య జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నిరోషా రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ రవి ప్రసాద్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Social Plugin