గుండాల మండలం అక్టోబర్ 18 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి
బీసీ రిజర్వేషన్ల సాధన కోసం వివిధ బీసీ సంఘాలు ఏర్పరిచిన బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన “బంద్ ఫర్ జస్టిస్” కార్యక్రమానికి గుండాల అఖిలపక్ష పార్టీలు బలమైన మద్దతు ప్రకటించాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని, ఇందుకోసం పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టాలని నాయకులు ఏకగళంగా డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో గుండాల సెంటర్లో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. బీసీ సంఘాల నేతలు, అఖిలపక్ష ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని, బీసీల హక్కుల సాధన కోసం తెలంగాణ ఉద్యమం తరహాలో సామాజిక ఉద్యమం ప్రారంభించాలని పిలుపునిచ్చారు.
గౌడ కుల సంఘం పెద్దలు బత్తిని సాయన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు నేతలు మాట్లాడారు.
కోరం సీతారాములు (సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ), కుమారన్న (సిపిఐ), ఎస్‌కే ఖదీర్ (కాంగ్రెస్), పి. మంగయ్య (ప్రజా పందా), ఎస్‌కే అజాద్ (నవ చైతన్య యువజన సంఘం), సాంబయ్య (టి డి పి), గడ్డం లాలయ్య (రజక సంఘం), మాజోజు చంద్ర చారి (విశ్వబ్రాహ్మణ సంఘం), గడ్డం రమేష్ (టి ఆర్ ఎస్), బొమ్మెర్ల రాంబాబు (బి ఎస్ పి) తదితరులు మాట్లాడుతూ...
బీసీలకు జరిగిన అన్యాయానికి బీజేపీ నైతిక బాధ్యత వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్రానికి పంపించినా, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదని విమర్శించారు.
హైకోర్టు విధించిన స్టే కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయినట్లు పేర్కొంటూ, దీని వెనుక ఉన్న రాజకీయ నిర్లక్ష్యం బీజేపీదేనని ఆరోపించారు. అలాగే కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్‌లో పెట్టి ఆమోదించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని నాయకులు స్పష్టం చేశారు.
బీజేపీ కులతత్వ పార్టీగా వ్యవహరిస్తోందని, సమాన హక్కులను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని వారు విమర్శించారు. "బీసీల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే, తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేందుకు రాజ్యాంగ సవరణ చేసి, బిల్లును ఆమోదించాలని" వారు డిమాండ్ చేశారు. తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులు నిర్ణీత కాలంలో ఆమోదం పొందకపోతే వాటిని నోటిఫై చేయవచ్చని గుర్తుచేశారు. తెలంగాణలో కూడా ఆ మార్గాన్ని పరిశీలించాలని సూచించారు. పలువురు నాయకులు
బీజేపీ ఎంపీలపై తీరుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రం నుండి ప్రతినిధ్య వహిస్తున్న బీజేపీ ఎంపీలు, మంత్రులు కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదని నేతలు ఆరోపించారు.
"పార్టీ పదవులు కాపాడుకోవడమే కాకుండా, బీసీల హక్కుల కోసం రాజీనామా చేయాలన్న నైతిక ధైర్యం చూపించాలి" అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, అన్ని పార్టీ నేతలను డిల్లీకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా చర్యలు చేపట్టాలని వార్తా వేదిక ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు షారోజ్ పత్రికా ముఖంగా కోరారు.
బీసీ రిజర్వేషన్ల సాధనకు గుండాలలో అఖిలపక్ష ఐక్యత నూతన దిశగా అడుగుపెట్టింది. నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నంలో భాగంగా దీన్ని సామాజిక ఉద్యమంగా కొనసాగించాలని తీర్మానించారు.
బీసీలకు న్యాయం చేయకపోతే, రాష్ట్ర వ్యాప్తంగా దీని విస్తరణ తప్పదని సిపిఐ నాయకులు కుమార్ అన్న హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో గడ్డం శ్రీనివాస్ (సి పి ఐ), ఎస్‌కే షాహిద్ (సి పి ఐ), సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు
పెండేకట్ల పెంటయ్య, లాలు, ఈసం కృష్ణ, పరిశీక రవి, తెల్లం రాజు (ప్రజా పంద), ఇల్లందుల నరసింహులు (టి డి పి), గంగాదరి రాజయ్య, పల్లెర్ల మొగిలి, యాసారపు తిరుపతి, గుండెబోయిన నాగరాజు, బత్తిని రమేష్, మాజోజు జగన్, వెలిశాల రవి, హనుమా చారి, గడ్డం మోహన్, గడ్డం కృష్ణ, గామలపాటి నరేష్, మాదాల అశోక్ తదితర బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Social Plugin