నాగర్ కర్నూల్, అక్టోబర్ 30(ఎస్ బి న్యూస్):నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని సిద్దాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మన్నేవారిపల్లి గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. భారీ వర్షాల కారణంగా డిండి నుంచి వచ్చిన వర్షపు నీటితో నిర్వాసితులైన మర్లపాడు తాండ, కేష్య తాండ ప్రజల కోసం శుక్ర వారం ఈ శిబిరం నిర్వహించినట్లు సిద్దాపూర్ పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ శివశంకర్ తెలిపారు.
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె. రవికుమార్ ఆదేశాల మేరకు ఈ శిబిరం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. తాండాల ప్రజల కోసం మన్నేవారిపల్లిలో తాత్కాలిక వసతి, త్రాగునీరు, భోజన వసతి వంటి ఏర్పాట్లు చేశారు.
అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు వైద్య బృందం ముందస్తు పరీక్షలు నిర్వహించి, ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారికి తగిన చికిత్సతో పాటు, వైద్య సలహాలు అందించారు. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల రక్తపరీక్షలు నిర్వహించి, వారికి అవసరమైన మందులు పంపిణీ చేశారు.
వ్యక్తిగత శుభ్రత పాటించాలని, తాత్కాలిక శిబిరంలో అందజేసిన ఆహారం, నీటినే వినియోగించుకోవాలని ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ శివశంకర్ మాట్లాడుతూ, “శిబిరం రోజుకు 24 గంటలు పనిచేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో రోగులను అచ్చంపేట క్రాంతి హాస్పిటల్‌కు తరలించేందుకు 108 వాహనం సిద్ధంగా ఉంచాం,(అచ్చంపేట లోప్రభుత్వ వైద్యులకుఎవరికయినాప్రైవేట్ క్రాంతిహాస్పటల్,ఉందాప్రజలుచర్చించుకుంటున్నారు.” అని తెలిపారు.
ఈ శిబిరంలో ఎంఎల్‌హెచ్‌పీ కీర్తన, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఫార్మసీ అధికారి భగత్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Social Plugin