నాగర్ కర్నూల్, అక్టోబర్ 18:(స్వాతంత్ర్య భారత్ న్యూస్ ప్రతినిధి)
విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పట్టణాలు, మండల కేంద్రాల్లో “ప్రజాబాట” కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల AEలు, ADEలు, DEలు, SEలు ప్రత్యక్షంగా పాల్గొని విద్యుత్ వినియోగదారులతో మాట్లాడారు.
ప్రజల నుంచి వచ్చిన సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. పలు ప్రాంతాల్లో సంరక్షణ, మరమ్మత్తు పనులు తక్షణమే చేపట్టడం ద్వారా వినియోగదారుల సంతృప్తి పొందారు.
విద్యుత్ శాఖ ప్రజాబాట కార్యక్రమాన్ని ప్రతి వారం మంగళవారం, గురువారం, శనివారం నిర్వహించాలని నిర్ణయించింది.
వినియోగదారులు తమ సమస్యలు, సూచనలను స్వయంగా అధికారులు ముందుంచాలని కోరుతూ జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ కె.వి. నరసింహారెడ్డి తెలిపారు. విద్యుత్ సేవల మెరుగుదలకు ప్రజల సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు.
Social Plugin