భారీ వర్షానికి పొంగిన డ్రైనేజీలు.. అశోక్‌నగర్‌లో సహాయక చర్యలు
మణుగూరు, జూన్ 11: అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి మణుగూరు మండలం సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని అశోక్‌నగర్ కాలనీలో 1, 2 వార్డుల డ్రైనేజీలు పొంగిపొర్లి రోడ్లపైకి నీరు చేరింది. స్థానికుల ఫిర్యాదు మేరకు ఉపసర్పంచ్ గాండ్ల సురేష్, పంచాయతీ కార్యదర్శి అశోక్ కుమార్ సిబ్బందితో కలిసి ప్రాంతాన్ని పరిశీలించారు. మూసుకుపోయిన డ్రైనేజీలను గుర్తించి వెంటనే క్లీనింగ్ పనులు చేపట్టాలని ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన సిబ్బంది పనులు ప్రారంభించారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ నాయకులు త్రిమూర్తులు, చారి తదితరులు పాల్గొన్నారు.