Subscribe Us

SB LATEST:

14, డిసెంబర్ 2025, ఆదివారం

పాలకవర్గ పార్టీలను ఓడించండి....న్యూ డెమోక్రసీ అభ్యర్థిని గెలిపించండి

గుండాల మండలం డిసెంబర్ 14 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి


త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గుండాల గ్రామపంచాయతీ న్యూ డెమోక్రసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోరం సీతారాములు విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం గుండాల మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
    ఈ ర్యాలీ నుద్దేశించి *సీపీఐ(ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునురి మధు, తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి కోడెం వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి పునెం శ్రీనివాస్, ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు చంద్రయ్య దొర, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, సిపిఎం మండల కార్యదర్శి తోలెం చిన్న మల్లయ్య మాట్లాడుతూ* గత ఐదు సంవత్సరాలు గుండాల గ్రామపంచాయతీ సర్పంచ్ గా పనిచేసిన కొమరం సీతారాములు పార్టీలకు అతీతంగా అందరిని కలుపుకొని పోయాడని, గుండాల గ్రామపంచాయతీ అభివృద్ధి కొరకు ప్రభుత్వంతో కొట్లాడి లక్షలాది రూపాయల నిధులతో గుండాల గ్రామపంచాయతీ అభివృద్ధికి తోడ్పడ్డాడని, తిరిగి న్యూ డెమోక్రసీ పార్టీ కొమరం సీతారాములు కు టికెట్ ఇవ్వడం హర్శించదగ్గ విషయమని, కష్టజీవి పేద ప్రజల సమస్యలు పరిష్కరించే వ్యక్తి కొమరం సీతారాములను ఈసారి తిరిగి కొమరం సీతారాములు కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.
  కొన్ని పాలకవర్గ పార్టీలు అధికారాన్ని ఉపయోగించి లక్షలాది రూపాయల డబ్బు పంపింణి గెలవాలని కుయుక్తులు పన్నుతున్నాయని ఇట్లాంటి కుట్రలను ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
     *ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు అరెం నరేష్, యాసారపు వెంకన్న, గడ్డం లాలయ్య,పెండకట్ల పెంటన్న, పర్శక రవి, ఈసం మంగన్న, పాయం ఎల్లన్న, భానుతు లాలు, మానాల ఉపేందర్, ముఖ్య వెంకన్న, కల్తీ నరసింహారావు, తాటి రమేష్, అరెం రామారావు, టిఆర్ఎస్ నాయకులు గడ్డం వీరన్న, పొంబోయిన సుధాకర్, మరియుఈసం పాపారావు, పొంబోయిన హరినాథ్ తదితరులు పాల్గొన్నారు*.