- బాలికల విభాగంలో విజేతగా ఖమ్మం
- బాలుర జట్టు విజేతలుగా హైదరాబాద్
- ముఖ్యఅతిథిగా హాజరై షీల్డ్ అందజేసిన ఎమ్మెల్యే పాయం, ఐటీడీఏ పీవో రాహుల్పినపాక:ఈ బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడు రోజులుగా జరిగిన అండర్-17 రాష్ట్రస్థాయి బాలబాలికల కబడ్డీ పోటీలు సోమవారం ముగిశాయి. బాలికలు విభాగంలో ఖమ్మం జట్టు, బాలుర విభాగాల్లో హైదరాబాద్ జట్లు విజేతలుగా నిలిచాయి.చివరి రోజున ఫైనల్స్ పోటీలు హోరాహోరీగా సాగాయి. బాలికల విభాగంలో నల్గొండ, ఖమ్మం జిల్లాల క్రీడాకారులు పోటీపడ్డారు. చివరకు ఖమ్మం జిల్లా విన్నర్‌గా, నల్లగొండ జిల్లా క్రీడాకారులు రన్నర్‌గా నిలిచారు. బాలుర విభాగంలో ఖమ్మం, హైదరాబాద్ జిల్లాలు తలపడ్డాయి. హైదరాబాద్ జిల్లా విన్నర్‌గా, ఖమ్మం రన్నర్‌గా నిలిచాయి.ముందుగా ఈ క్రీడలకు ముఖ్యఅతిథిగా పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఐటిడిఏ పిఓ రాహుల్ , డీఎఫ్ఓ కోటేశ్వరరావు , ఐఆర్ఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రీడలను ప్రారంభించారు.
Social Plugin